అభివృద్ధి పనుల వేగవంతానికి కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశం

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్, ఏప్రిల్ 4:

నియోజకవర్గంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. శనివారం కొడంగల్ కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్తు శాఖలు చేపడుతున్న వివిధ పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరై గ్రౌండింగ్ కానీ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను సూచించారు. అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు.

ముఖ్యంగా అంగన్వాడి కేంద్రాలు, బీటీ రోడ్లు, బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుద్యాల్ మండల సముదాయ భవన పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, వేగంగా జరిగేలా చూడాలని కోరారు.

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

సమీక్షా సమావేశం అనంతరం కలెక్టర్ క్షేత్రస్థాయిలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పనులను పరిశీలించిన కలెక్టర్, నూతన ఫర్నిచర్ సమకూర్చుకోవాలని అధికారులను సూచించారు. పట్టణ కేంద్రంలో అంతర్గత మురుగు కాలువలను పరిశీలించి, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు.

తదనంతరం పట్టణ కేంద్రంలో నిర్మాణం గావిస్తున్న స్విమ్మింగ్ పూల్, చెరువు సుందరీకరణ, డిగ్రీ కళాశాల పనులను కలెక్టర్ పరిశీలించారు. దుద్యాల మండలంలోని ఎడ్యుకేషన్ హబ్ లో చేపడుతున్న పనులను కూడా జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశం, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈడబ్ల్యూఐడిసి ఎస్ఇ విజయ భాస్కర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డిఇ సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఇ రవిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, దుద్యాల్ తాసిల్దార్ కిషన్ నాయక్, ఇంజనీర్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

పరిగిలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు: అక్రమ గ్యాస్, కుళ్ళిన మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాలు సీజ్!

పరిగిలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు: అక్రమ గ్యాస్, కుళ్ళిన మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాలు సీజ్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles