కొడంగల్ :
– కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్
పేదోడి సొంతింటి కల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు .
సోమవారం కొడంగల్ మండల పరిధిలోని పెద్ద నందిగామ గ్రామంలో పద్మమ్మ వెంకటయ్య, మంగలి అంజలీ కృష్ణా లకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ చూపి కెసిఆర్ ప్రజలను మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు .

కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హామీ ఇచ్చారంటే అదే కచ్చితంగా నెరవేరుస్తారని ప్రతి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి కళ్ళల్లో ఆనందం నింపాలనే సంకల్పంతో ప్రజాపాలన సాగిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చన్ బసప్ప , సంజీవరెడ్డి , రుద్రారం ఆనంద్ రెడ్డి గోపాల్ రెడ్డి ఎంపీడీవో ఉషారాణి పంచాయతీ సెక్రెటరీ డేవిడ్ లతోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .


