కోడంగల్ సర్కిల్‌లో వరి మిల్లుల ఆకస్మిక తనిఖీలు

  • రైతులకు మద్దతు ధర అందుతున్నదా..? అధికారుల సమీక్ష

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పరిగి డీఎస్పీ, కోడంగల్ సీఐతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు మరియు అదనపు కలెక్టర్ కలిసి కోడంగల్ సర్కిల్ పరిధిలోని వరి మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దుద్యాల మండలంలోని గౌరారం వరి మిల్లు, బొంరాస్‌పేట్ మండలంలోని బురన్‌పూర్ దుర్గా భవానీ వరి మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మిల్లుల యజమానులు, సిబ్బంది మరియు రైతులతో మాట్లాడిన అధికారులు కొనుగోలు ప్రక్రియ, తూకాల నిర్వహణ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందుతున్నదా..? తూకాల్లో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా..? అనే అంశాలను ప్రత్యేకంగా పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కొనుగోళ్లు పారదర్శకంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా మిల్లుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు రైతులను మోసం చేసే దళారులు, అక్రమ కొనుగోళ్లు లేదా తూకాల్లో మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రైతులకు అధికారులు సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles