- యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఫైర్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
కొడంగల్, మే 21: కొడంగల్ నియోజకవర్గంలో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు.
ఈ పరిస్థితుల్లో తన రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రైతులను అడ్డం పెట్టుకుని వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి “రైతే రాజు” అన్న సంకల్పంతో పరిపాలన కొనసాగిస్తున్నారని, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీ రుణాలు, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాలతో రైతాంగానికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం జూన్ 2న మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తీసుకురానుందని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కొడంగల్ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వడ్లకు బోనస్‌తో పాటు రైతులకు సకాలంలో రుణాలు కూడా అందజేస్తున్నామని చెప్పారు.
అవినీతి, అక్రమాలకు తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని, కొడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని మండిపడ్డారు.
ఇకనైనా అభివృద్ధికి సహకరించాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు తీర్పు ఇస్తారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రెడ్డి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



