శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహోత్సవాలు రేపటి నుంచి భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకలు మే 6 నుండి మే 8 వరకు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ మహోత్సవాలలో భాగంగా ముఖ్యంగా ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, ప్రసాదం, పార్కింగ్, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. కొడంగల్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ మహోత్సవాలకు సంబంధించి మంగళవారం సాయంత్రం ఆలయ ధర్మకర్తలు, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేశారు.
మే 6న బుధవారం ప్రారంభమైన ఉత్సవాల్లో పుణ్యాహవాచనం, అంకురార్పణ, విశేష పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మే 7న గురువారం జరిగే కార్యక్రమాలు మరింత వైభవంగా ఉండనున్నాయి. రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోపూజ, గోపదనివేదన, అగ్నిప్రతిష్ట, చతుర్వేద శ్రవణం, మహాశాంతి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడనుంది.
మే 8న శుక్రవారం ప్రధాన కార్యక్రమమైన ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఉదయం 7.10 గంటల నుంచి 8.20 గంటల మధ్య శుభ ముహూర్తంలో స్వామివారి ఆలయ ప్రధాన ప్రతిష్ఠ కార్యక్రమం వేద మంత్రాల నడుమ జరుగనుంది. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆర్చకులు పాల్గొని పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకకు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో కొడంగల్ పట్టణం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది. స్థానిక ప్రజలు కూడా మహోత్సవాల నిర్వహణలో చురుకుగా పాల్గొంటూ భక్తి భావాన్ని చాటుతున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, మూడు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



