శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

  • జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

కొడంగల్ అభివృద్ధి కార్యాలయంలో సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు జిల్లా అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 8వ తేదీన జరుగనున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం పూర్తిగా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చే విధంగా, వేద సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులతో రావాలని, ఆలయ పరంపర, వైదిక ధర్మాన్ని గౌరవించే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గుడి కార్యక్రమం కాబట్టి సౌమ్యత, నియమ నిష్ఠలు పాటించేలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని బస్సుల పార్కింగ్‌కు విస్తృత స్థలాలు కేటాయించాలి, ట్రాఫిక్ నిర్వహణను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల కోసం సమృద్ధిగా అన్నప్రసాదం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, అన్ని శాఖలకు ఇప్పటికే ప్రత్యేక బాధ్యతలు కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసినట్లు తెలిపారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, త్రాగునీటి సరఫరా, విశాలమైన స్టేజ్ నిర్మాణం, భక్తులకు భోజన సదుపాయాలు వంటి అంశాలను సంబంధిత శాఖలు సమన్వయంతో నిర్వహిస్తున్నాయని చెప్పారు.

అలాగే వైద్య సదుపాయాల పరంగా ప్రత్యేక మెడికల్ టీమ్‌లను సిద్ధం చేసి, అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, శానిటేషన్ విభాగం ద్వారా పరిశుభ్రత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా విశ్రాంతి మండపాలు, నీడ ఏర్పాట్లు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తూ, పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

ఈ సమీక్ష సమావేశంలో నారాయణపేట్ కలెక్టర్ సి. ప్రియాంక, అదనపు కలెక్టర్లు ఉమా, పి. శంకర్ ప్రసాద్, వెంకటాచారి, ఆర్‌డీవోలు అనిత, వాసు చంద్ర, సుదీర్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ శంకుస్థాపన కార్యక్రమం కొడంగల్ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా మరియు అభివృద్ధి పరంగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో భక్తులకు మరింత సౌకర్యాలు లభించడంతో పాటు, ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని తెలిపారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, నిర్వహణలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles