- కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
- చేస్తున్న సంచారజాతుల నాయకులు
- సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించిన సంచార జాతుల ప్రజలు
శ్రీ బలభీమా న్యూస్ / కొడంగల్
తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర సంచార జాతర ఉపాధ్యక్షులు మోహన్ చౌహన్ బయలు కమ్మర రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర సూర్యవంశీల ఆధ్వర్యంలో మంగళ వారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతి కులాల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆ వర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న SEED (Scheme for Economic Empowerment of De-notified, Nomadic and Semi-Nomadic Tribes) పథకం కింద అర్హులైన సంచార జాతులను గుర్తించి, వారికి ప్రత్యేక ధృవపత్రాలు జారీ చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (DNT) బోర్డు సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఈ అంశంపై సమగ్ర అధ్యయనం నిర్వహించింది. రాష్ట్రంలోని సంచార జాతుల ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కమిషన్ అధ్యయనం ప్రకారం, BC-A గ్రూపులో 49 కులాలు, BC-E గ్రూపులో 2 కులాలు కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించాలని సిఫార్సు చేసింది. ఈ కులాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న కుల ధృవపత్రం నమూనాలో మార్పులు చేసి, వాటిలో “నోమాడిక్ కమ్యూనిటీ” అనే గుర్తింపును చేర్చాలని సూచించింది. దీని ద్వారా సంచార జాతుల ప్రత్యేకతను అధికారికంగా గుర్తించడం సాధ్యమవుతుందని కమిషన్ పేర్కొంది.
అలాగే ఈ ధృవపత్రాల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) స్థాయిలో మాత్రమే వాటిని జారీ చేయాలని సూచించింది. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందేలా కట్టుదిట్టమైన వ్యవస్థ అమల్లోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంకా, రాష్ట్రంలో SEED పథకం అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం మరియు DNT బోర్డుతో సమన్వయం సాధించడానికి, అర్హులైన లబ్ధిదారులకు పథక ప్రయోజనాలు చేరేలా చూడడానికి MBC కార్పొరేషన్ లేదా ఇతర అనుకూల సంస్థను రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీగా నియమించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
రాష్ట్రానికి ప్రత్యేకంగా సంచార జాతుల జాబితా రూపొందించడం వల్ల భవిష్యత్తులో ఈ వర్గాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయగలవని, తద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ వర్గాల స్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన కుల గణనలో సంచార జాతుల జనాభాను పరిగణలోకి తీసుకుని, వారి అభివృద్ధికి దోహదపడే విధంగా బీసీ కమిషన్ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించడం గమనార్హం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతుల సంఘాలు స్వాగతిస్తున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఉప రాష్ట్ర అధ్యక్షులు మోహన్ చవాన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా సంచార జాతుల ప్రజలకు న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందే మార్గం సుగమమవుతుందని తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బీసీ కమిషన్, బీసీ కమిషనర్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ మరియు వివిధ స్థాయి ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార జాతుల సంఘాల కమిటీలను ఉద్దేశించి, ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా పలు జిల్లాల్లో మీడియా సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు రాంచందర్ సూర్యవంశీ (రాష్ట్ర అధ్యక్షులు), నారాయణ సలోంకీ, శివాజీ సలోంకీ, కృష్ణ సలోంకీ, బీమయ్య సలోంకీ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ బైలు కమ్మర సంఘం అధ్యక్షులు ఆనంద్ పవర్, జనరల్ సెక్రటరీ శివాజీ చవాన్, విజయ్ పవర్, సంజు పవర్, బాబు చవాన్, కృష్ణ సలోంకీ తదితరులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
సంచార జాతుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో వారి సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని, ఈ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయడంలో కీలకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



