కొడంగల్‌లో విజృంభిస్తున్న దోమలు: టైఫాయిడ్, మలేరియా బారిన పడుతున్న యువత

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

వికారాబాద్ జిల్లా: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడద అదుపు తప్పడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి, ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలి పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు.

బాధితులను పరామర్శించిన మాజీ కౌన్సిలర్

పట్టణానికి చెందిన పాశం సాయిల్ కుమారుడు పాశం రాకేష్, అలాగే అల్లపురం మొగులప్ప కుమారుడు అల్లపురం రామకృష్ణ గత కొన్ని రోజులుగా టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నరు . బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు.

మున్సిపల్ యంత్రాంగంపై ఒత్తిడి

దోమల నివారణలో మున్సిపల్ యంత్రాంగం వైఫల్యంపై మధుసూదన్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తో ఫోన్లో మాట్లాడారు. పట్టణంలో మురుగు కాల్వలు సక్రమంగా లేకపోవడం, నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్య డిమాండ్లు:

  • ఫాగింగ్ నిర్వహణ: పట్టణంలోని ప్రతి వార్డులో వెంటనే ఫాగింగ్ చేయించాలని కోరారు.
  • యాంటీ-లార్వా ఆపరేషన్: నిల్వ ఉన్న నీటిలో మందులు పిచికారీ చేసి దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు.
  • పారిశుధ్య మెరుగుదల: చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

“ప్రజల ఆరోగ్యం విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని . దోమల నివారణకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి తగు చర్యలని లేని పక్షంలో ఆందోళన బాట పట్టక తప్పదని అన్నారు.

కాళేశ్వరం మరమ్మతుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

కాళేశ్వరం మరమ్మతుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

కొడంగల్: అంగన్‌వాడీలకు సర్కార్ కానుక – స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన తిరుపతి రెడ్డి

కొడంగల్: అంగన్‌వాడీలకు సర్కార్ కానుక – స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన తిరుపతి రెడ్డి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles