సుల్తాన్పూర్‌లో బహిరంగంగా మద్యం విక్రయాలు

  • చిన్నపిల్లలకు సైతం మద్యం అమ్ముతున్న కిరాణా దుకాణదారుడు..?
  • అధిక ధరలకు విక్రయాలు.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

సుల్తాన్పూర్ గ్రామం : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామంలోని ఓ కిరాణా షాపు యజమాని నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తూ, అధిక ధరలకు మద్యం అమ్ముతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాల్సి ఉన్నప్పటికీ, గ్రామంలో చిన్నపిల్లలకు సైతం మద్యం అందుబాటులోకి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్, కాలేజీ యువకులకు సైతం మద్యం అమ్ముతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామ యువత చెడు అలవాట్లకు బానిసయ్యే ప్రమాదం ఉందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో రోజురోజుకు మద్యం వినియోగం పెరుగుతుండటంతో కుటుంబాల్లో కలహాలు, యువతలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలు అరికట్టాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా, సంబంధిత కిరాణా షాపు యజమాని పోలీసులకు ప్రతినెల మామూళ్లు ఇస్తున్నానని, “ఎవరు నన్ను ఏం చేయలేరు” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం గ్రామంలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామస్తుల ప్రకారం, పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. అక్రమంగా మద్యం అమ్మకాల వల్ల గ్రామ వాతావరణం చెడిపోతోందని, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని వారు అంటున్నారు.

ప్రత్యేకంగా మహిళలు, పెద్దలు గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత దుకాణాన్ని సీజ్ చేయాలని కోరుతున్నారు. గ్రామంలో పోలీసు నిఘా పెంచి, అక్రమ మద్యం వ్యాపారంపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడతారా..? అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటారా..? అనే అంశంపై గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles