- మూడు రోడ్ల కూడలిలో పూజా సామాగ్రి గుర్తింపు..
- భయాందోళనలో కాలనీవాసులు
- మూఢనమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
వికారాబాద్ : సైన్స్, టెక్నాలజీ రంగాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ సమాజంలో మూఢనమ్మకాలు ఇంకా పూర్తిగా తగ్గిపోలేదనే ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. శనివారం అమావాస్య అర్ధరాత్రి వేళ వికారాబాద్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ రోడ్డులో ఉన్న గర్ల్స్ హైస్కూల్ వెనుక భాగంలోని మూడు రోడ్ల కూడలిలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతం గుండా వెళ్లిన ప్రజలు రోడ్డుమధ్యలో దింపుడు కల్లెం ఆనవాళ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, ఎర్రటి కుంకుమ చల్లిన గుర్తులు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రత్యేకంగా అమావాస్య రాత్రి సమయంలో ఇలాంటి పూజలు నిర్వహించడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో ప్రజలను భయపెట్టే విధంగా క్షుద్రపూజలు చేయడం సమాజంలో అనవసర భయాందోళనలకు దారితీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఈ ఘటనతో భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
కొంతమంది స్థానికులు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం పెరుగుతోందని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలనీల్లో రాత్రి గస్తీని పెంచడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. క్షుద్రపూజలు, మూఢాచారాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



