బడిబాటలో ఉపాధ్యాయులు

  • అంగన్వాడి సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

ఎర్పుమల్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో “బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది కలిసి గ్రామంలో పర్యటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను కలసి విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు తదితర సౌకర్యాలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు.

అలాగే అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న చిన్నారులను పాఠశాలలో నమోదు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సుజాత, గౌసియా బేగం, మాజీ స్కూల్ చైర్మన్ అనంతయ్య, డ్వాక్రా మహిళలు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Journalist Naresh kumar Patel : Kodangal

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles