వరుస దొంగతనాలతో ఆందోళనలో రైతులు

  • పంపు మోటార్ కేబుల్ వైర్లు, ఫీజుల చోరీలు
  • పోలీసుల తక్షణ చర్యలు కోరుతున్న బాధితులు

శ్రీ బల భీమ న్యూస్ / యాలాల్

యాలాల మండలం : వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని దౌలాపూర్, బండమీదిపల్లి తదితర గ్రామాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత మూడు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ పొలాల్లోని పంపు మోటార్ కేబుల్ వైర్లు, స్టార్టర్లలో ఉన్న ఫీజులను అపహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి దౌలాపూర్, బండమీదిపల్లి గ్రామాల్లో సుమారు 10 మంది రైతుల పొలాల్లో దొంగతనాలు జరిగినట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో చోరీలు జరిగినట్లు పేర్కొన్నారు. వరుస ఘటనలతో రైతులు భయాందోళనలకు గురవుతూ, రాత్రిపూట పొలాల వద్ద కాపలా కాస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ విషయంపై పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దౌలాపూర్ గ్రామానికి చెందిన లాలప్ప, బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలు కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో రాత్రి పహారా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Journalist Hanmanthu // జర్నలిస్ట్ హనుమంతు

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles