- సమాజానికి ఉపాధ్యాయులు ఇచ్చే సందేశం ఇదేనా
- పేరుకే ఉపాధ్యాయ సంఘాలు, కొరవడుతున్న సఖ్యత.. పెరుగుతున్న కక్షలు
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ :

పాఠాలు చెప్పి ప్రపంచ జ్ఞానం పంచే ఉపాధ్యాయులు ఇంతకీ ఇంతకు విలువలు కోల్పోతూ సభ్య సమాజంలో తలదించుకునే అవమానకర సంఘటనలకు పాల్పడుతుండటం విచారకరం. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో మోమినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అసభ్యకర ప్రవర్తన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఓవైపు ఈ సంఘటనపై పోలీసులు అధికారులు విచారణ పనిలో ఉంటున్నప్పటికీ స్థానికులు, విద్యావంతులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలు రకాల చర్చలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ సంఘటన వెలుగు చూడటానికి కారణం ఆ పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఉన్న మనస్పర్ధలే కక్షకు దారితీసాయని తెలుస్తోంది.

పాఠశాలలో ఉన్న విద్యార్థినిపై పాఠాల పేరుతో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన ఉపాధ్యాయుడు స్వామిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఉపాధ్యాయుడు స్వామీకి గిట్టని అదే పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడు గురునాథరెడ్డితో పాటు మరో పలువురు ఉపాధ్యాయులు స్వామిపై కక్ష కట్టి ఈ సంఘటనకు పాల్పడినట్లు అక్కడి స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కొలవడిన ఐక్యత, పెరిగిన మనస్పర్ధలు, కక్షలు ఇలా విద్యార్థినులను అడ్డం పెట్టుకొని వారి శీలాలతో ఆటలాడుకుంటున్నారని చెప్పుకోవడం అందరిని కలచి వేస్తుంది. సమాజానికి ఉపాధ్యాయులు ఇచ్చే సందేశం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి విద్యార్థినుల తల్లిదండ్రులు జంకుతున్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా గురుకుల తదితర బాలికల పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు ఉపాధ్యాయుల పట్ల తీసుకుంటున్నప్పటికీ, అలాంటి తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నత పాఠశాల కళాశాల విద్య బోధనలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని షరతులు కూడా విధించాలని కోరుతున్నారు. వయోపరమైన నిబంధనలు అమలులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
పేదల ఆకలి తీరుస్తూ.. రైతుకు భరోసానిస్తూ: ‘సన్నబియ్యం’ పథకం విజయగాథ..
Cm Revanth reddy
పేదల ఆకలి తీరుస్తూ.. రైతుకు భరోసానిస్తూ: ‘సన్నబియ్యం’ పథకం విజయగాథ


