న్యాయం కోసం వెళ్లిన మహిళకు పోలీస్ స్టేషన్‌లోనే అన్యాయం

  • ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన సీఐపై కేసు నమోదు
  • గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని ఆరోపణలు..
  • డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఉన్నతాధికారులు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన తెలంగాణ పోలీస్ శాఖను కలవరపెడుతోంది. భర్త వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ఆశించి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితకు అక్కడే మరో అన్యాయం ఎదురైంది. ఆమెకు న్యాయం చేస్తానని నమ్మబలికిన సీఐ.. ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను మోసం చేసి లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన భూక్యా రాజు నాయక్ వద్దకు బాధిత మహిళ తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కుటుంబ కలహాలు, భర్త హింసతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. పోలీసుల నుంచి న్యాయం దక్కుతుందనే ఆశతో ఫిర్యాదు చేసింది. అయితే కేసును విచారించాల్సిన సీఐ.. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ మహిళతో వ్యక్తిగత సంబంధం పెంచుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులో ఉన్న ఫోన్ నంబర్‌ను తీసుకున్న సీఐ రాజు నాయక్.. మొదట కేసు పురోగతి పేరుతో ఆమెతో ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత తరచూ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ దగ్గరవ్వడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను మాయమాటలతో వలలో వేసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడగా.. బాధిత మహిళ గర్భవతైంది. గర్భం దాల్చిన విషయం సీఐకి తెలియజేయగా.. పెళ్లి గురించి మాట్లాడితే తప్పించుకునే ప్రయత్నం చేశాడని బాధితురాలు పేర్కొంది. అనంతరం బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం జరిగిందని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ.. చివరకు ఈనెల 7వ తేదీన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐపై అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. మహిళ చేసిన ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐ భూక్యా రాజు నాయక్‌పై కేసు నమోదు చేయించారు. అలాగే ప్రస్తుతం ఖమ్మం కమిషనరేట్‌లో సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న అతడిని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు ఇటీవలే ఆమె భర్త నుంచి విడాకులు వచ్చినట్లు సమాచారం. ఈ విడాకుల విషయంలో కూడా సీఐ రాజు నాయక్ ప్రభావం చూపించి, మహిళ భర్తపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చిన మహిళల భద్రతకే భంగం కలిగేలా జరిగిన ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే మహిళను మోసం చేశాడనే ఆరోపణలు రావడం పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని అభిప్రాయపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles