‘టెన్‌’షన్‌ వద్దు..

పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్‌, టీవీ వైపు మనస్సు మరలకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ విద్యార్థి ఏర్పాటు చేసుకున్న టైం టేబుల్‌ ప్రకారం చదువు కోవాల్సి ఉంటుంది. సందేహాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అందుకోసం తరగతి ఉపాధ్యాయులు లేదా, మంచి స్నేహితులు, సీనియర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలి.

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. విద్యార్థిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతిక్షణం కృషి చేయాలి. అవసరమైన ధైర్యం అందివ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన పౌష్టికాహారం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సమయానికి తగినంత నిద్రపోయేలా కూడా చూడాలి.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్‌ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మార్చి 14 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles