అప్పుల కోసం కూతురిని బలవంతపు పెళ్లి.. సీఎం రేవంత్ సీరియస్

  • 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల బీఆర్ఎస్ నేత
  • సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చిన రిపోర్టర్
  • విచారణ చేయాలని డీజీపీకి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : / జనగామ, మే 22:
జనగామ జిల్లాలో 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల వ్యక్తికి బలవంతంగా వివాహం జరిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి Revanth Reddy దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి డీజీపీకి విచారణ ఆదేశాలు జారీ చేశారు.

మీడియా సమావేశం సందర్భంగా ఓ రిపోర్టర్ ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకురాగా.. “ఈ విషయం నా దృష్టికి రాలేదు.. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి” అంటూ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అప్పుల భారం.. కూతురి పెళ్లికి ఒప్పందం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన కక్కెర్ల రాకేష్ గౌడ్‌కు భారీగా అప్పులు ఉన్నట్లు తెలిసింది. సుమారు రూ.20 లక్షల అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక నాయకుడు ఆవుల ప్రశాంత్ రెడ్డి వద్ద సహాయం కోరినట్లు సమాచారం.

అయితే.. అప్పులు తీర్చే ప్రతిఫలంగా తన 18 ఏళ్ల కుమార్తె లహరిని వివాహం చేయాలని ప్రశాంత్ రెడ్డి షరతు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుల ఒత్తిడితో యువతి తండ్రి, సవతి తల్లి ఈ వివాహానికి అంగీకరించినట్లు బాధితురాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లికి నిరాకరించిన యువతి

తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా జరిపించారని యువతి ఆరోపించింది. పెళ్లికి ఒప్పుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఈ నెల 8న జనగామ జిల్లా పెంబర్తికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు ఆవుల ప్రశాంత్ రెడ్డితో జీడికల్ ఆలయంలో వివాహం జరిగినట్లు వెల్లడించింది.

పెళ్లి తర్వాత ఇంటి నుంచి పరార్

వివాహం జరిగిన మరుసటి రోజు అంటే మే 9న యువతి ప్రశాంత్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో తన భార్య బంగారం, నగదుతో పరారైందంటూ ప్రశాంత్ రెడ్డి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక హైదరాబాద్‌కు చేరుకున్న బాధితురాలు మే 17న మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. తన తండ్రి, సవతి తల్లి డబ్బుల కోసం బలవంతంగా వివాహం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరింది.

పోలీసుల దర్యాప్తు కొనసాగింపు

ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలోనే యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన విషయం వెలుగులోకి వచ్చినట్లు జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ యువతి గతంలో మైనర్‌గా ఉన్న సమయంలో మరో వ్యక్తితో కులాంతర వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని సీఎం ఆదేశించడంతో.. పోలీసు శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles