శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ :

వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామంలోఆదివారం అక్షరాస్యత వైపు సరికొత్త అడుగులు పడ్డాయి. నిరుద్యోగ మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఉల్లాస్ అమ్మకు అక్షరమాల’ అనే వినూత్న కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, అక్షరజ్ఞానం ద్వారా సమాజంలో చైతన్యం పొందేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. SHG (Self-Help Group) మహిళల అక్షరాస్యతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ దిశగా చేపట్టిన ‘ఉల్లాస్ అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి మహిళల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అన్ని రంగాలలో మహిళలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు ఇలాంటి విద్యా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ నేతృత్వంలో మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటి విద్యా కార్యక్రమాలను విస్తరించి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో Rp బుక్ కీపర్ సువర్ణ మరియు ఇతర గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపల్లి పరమేశ్వరుని గుట్టపై అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం


