శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీయడం అంటే అది కేవలం ఉపాధ్యాయులకు సాధ్యమవుతుందని కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ అన్నారు. ఇటీవల వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాలలో మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు పాత కొడంగల్ తండా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా అందులో పది మంది విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో హర్షనీయమని అన్నారు. అందుకు గురువారం పాఠశాల విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయక్ ఉపాధ్యాయులు శివలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం వల్లనే 10 మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం తండాకే గర్వకారణమన్నారు . కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కూడా విద్యార్థులతో పాటు పాఠశాల అధ్యాపకులను అభినందించడం జరిగిందని తెలిపారు . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేయడం వల్లనే కొడంగల్ నియోజకవర్గం లో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడం జరిగింద పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తూ విద్యార్థిని విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా మున్సిపల్ చైర్మన్ సమక్షంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
https://www.facebook.com/share/v/1G7KGwJnXr/
కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు
కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్న శ్రీ బల భీమ న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరూ ఆదరించి అభిమానించాలని కోరుతూ మా ఛానల్ ను మీరందరూ కూడా తప్పకుండా Subscribe చేయండి, Follow చేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ..



