శ్రీ బల భీమ న్యూస్ – వరంగల్ :

వరంగల్ జిల్లా నర్సంపేట లో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ చేసిన నిర్వాకం చూస్తుంటే మతిపోతది. కడుపు నొప్పితో వచ్చిన ఓ బాలిక రిపోర్టుల “గర్భవతి” అని రాసి ఇచ్చిండ్రు. ఆ తప్పుడు రిపోర్టు చూసి ఆ తల్లిదండ్రులు గుండె ఆగినంత పనైంది. వెంటనే ఇంకో నర్సింగ్ హోమ్‌కు తీసుకపోయి చెక్ చేయిస్తే.. అది గర్భం కాదని, చిన్న ఆరోగ్య సమస్యే అని డాక్టర్లు తేల్చి చెప్పిండ్రు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కుటుంబ సభ్యులు ఆ స్కానింగ్ సెంటర్‌కు పోయి డాక్టరును నిలదీసి, కొంచెం గట్టిగనే తగిలించిండ్రు (దాడి చేసిండ్రు). ఇట్లాంటి వెర్రి మొర్రి రిపోర్టులు ఇచ్చి మనుషుల ప్రాణాలతో, పరువుతో ఆడుకుంటున్న సెంటర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జనం మస్తు మండిపడుతుండ్రు. ఆఫీసర్లు కూడా దీని మీద ఎంక్వయిరీ చేసే అవకాశం ఉంది.

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు
ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు


