అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ పాయింట్స్…

  • ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్..
  • అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చాం.

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్

రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే నిధుల కేటాయింపు జరిగింది

తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్ద పీట వేసింది

అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించాం.

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాం.

ఈ పధకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నాం. రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తించనుంది

విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించాం.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తాం

ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభుత్వ స్కూల్లో చదివే విధానాన్ని అమలు చేస్తున్నాం

అప్పులు, ఆదాయానికి సంబంధించి పారదర్శకంగా అన్ని వివరాలు వెల్లడించాం

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు.

ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే 3.30 లక్షల కోట్లు చెల్లించాం.

రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వివిధ విభాగాల్లో ఉన్న లీకేజీలను అరికడుతున్నాం.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నాం.

తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల :: కోడంగల్

తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల :: కోడంగల్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles