తెలంగాణ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే..

  • 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి
  • ఆరు గ్యారెంటీలకు భారీగా నిధుల కేటాయింపు
  • 2025–26 బడ్జెట్ vs 2026–27 బడ్జెట్

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్

  • వ్యవసాయం
  • 2025–26 : ₹24,439 కోట్లు
  • 2026–27 : ₹23,179 కోట్లు
  • ⬇️ తగ్గింపు
  • పంచాయతీ రాజ్ / గ్రామాభివృద్ధి
  • 2025–26 : ₹31,605 కోట్లు
  • 2026–27 : ₹33,688 కోట్లు
  • ⬆️ పెంపు
  • విద్యా శాఖ
  • 2025–26 : ₹23,108 కోట్లు
  • 2026–27 : ₹26,674 కోట్లు
  • ⬆️ పెంపు
  • ఇరిగేషన్
  • 2025–26 : ₹23,373 కోట్లు
  • 2026–27 : ₹22,615 కోట్లు
  • ⬇️ తగ్గింపు
  • విద్యుత్ శాఖ (ఎనర్జీ)
  • 2025–26 : ₹21,221 కోట్లు
  • 2026–27 : ₹21,285 కోట్లు
  • ➡️ దాదాపు సేమ్

  • ఆరోగ్య శాఖ
  • 2025–26 : ₹12,393 కోట్లు
  • 2026–27 : ₹13,679 కోట్లు
  • ⬆️ పెంపు
  • సివిల్ సప్లై శాఖ
  • 2025–26 : ₹5,734 కోట్లు
  • 2026–27 : ₹7,366 కోట్లు
  • ⬆️ పెంపు

  • మహిళా శిశు సంక్షేమం
  • 2025–26 : ₹2,862 కోట్లు
  • 2026–27 : ₹3,143 కోట్లు
  • ⬆️ పెంపు
  • ఇండస్ట్రీస్ శాఖ
  • 2025–26 : ₹3,527 కోట్లు
  • 2026–27 : ₹3,490 కోట్లు
  • ⬇️ తగ్గింపు
  • ఐటీ శాఖ
  • 2025–26 : ₹774 కోట్ల…
  • బడ్జెట్ ప్రివ్యూ..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ 3.30 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించవచ్చుని సమాచారం.

రూ.3,04,965 కోట్లతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మూలధన వ్యయాన్ని ఈసారి గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.36,504 కోట్లు కేటాయించగా.. ఈసారి దీనిని రూ.45 వేల కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రూ.29 వేల కోట్లు అవసరమని గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఈ పథకానికి రూ.12,571 కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.17 వేల కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. కీలక శాఖలకు భారీ కేటాయింపుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles