కొండాపురంలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై బీజేపీ వినతి

శ్రీ బల భీమ న్యూస్ /కొండాపురం/తూర్పు ఎర్రబల్లి (అక్టోబర్ 5) :

తూర్పు ఎర్రబల్లి పంచాయతీ పరిధిలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి, విద్యుత్ స్తంభాల కొరతను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీజేపీ కొండాపురం మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు ఎర్రబల్లి పంచాయతీ పరిధిలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవి కాలానికే పరిమితం కాకుండా ప్రస్తుతం కూడా నీటి సమస్య కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు తక్షణమే తగిన నీటి వసతి కల్పించాలని అధికారులను కోరారు.

అదేవిధంగా గ్రామంలో విద్యుత్ స్తంభాల కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మౌలిక సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.

జర్నలిస్టు బాలాజీ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles