శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 5 :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్‌లో ప్రముఖ హెటిరో ఫార్మా కంపెనీ సౌజన్యంతో కళాశాల ప్లేస్మెంట్ సెల్, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌కు ఉద్యోగార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో మొత్తం 64 మంది ఉద్యోగార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సమావేశానికి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డా. సాకేత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు ఇటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంతో పాటు మంచి ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అవకాశాలు లభిస్తాయని అన్నారు.
హెటిరో సంస్థ హెచ్ఆర్ ప్రతినిధులు డి. చరణ్, పి. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఫార్మా రంగంలో హెటిరో సంస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో 200కుపైగా అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి, క్యూసీ, క్యూ.ఏ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, హెటిరో వంటి ప్రముఖ సంస్థ తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం ప్రతిష్టాత్మకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి దోహదపడటంతో పాటు, విద్యార్థుల ప్రతిభకు ప్రముఖ కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ టి. రాంబాబు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. ఆర్. శ్రీనివాస్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. ఎం. హరిప్రియ, రసాయన శాస్త్ర అధ్యాపకులు డా. వి. శ్రీధర్ కుమార్, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.


