రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. చర్చించే అంశాలివే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్, మార్చి15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారి రావడం విశేషం. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. పదిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉంది. సభ ప్రాంగణంలో రేపు(సోమవారం) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహా రూపాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles