పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు

కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.

భువనేశ్వర్, మార్చి 15: ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు. 1 AK-47, 4 SLRలు, 1 INSAS రైఫిల్, 1 12-బోర్ గన్, 2 సింగిల్ షాట్ ఆయుధాలను వీరు అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన నక్సలైట్లలో చాలా మంది బస్తర్ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ 11 మంది నక్సలైట్లపై ప్రభుత్వం గతంలో 1 కోటి 34 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని (ఇనామ్) ప్రకటించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles