వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. నిర్లక్ష్యానికి తావులేదు: సీఎం రేవంత్ రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 14:

రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల భద్రత, నగరాల్లో నీటిమునిగే ప్రాంతాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, యూరియా పంపిణీ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కచ్చితంగా మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజినీర్లు తప్పనిసరిగా మాన్యువల్‌ను అమలు చేయాలని, ఇందులో ఎటువంటి రాజీకి తావులేదన్నారు. ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు (సీఈలు), సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్‌సీలు) వర్షాకాలం మొత్తం స్థానికంగానే ఉండాలని ఆదేశించారు.

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. వర్షాల సమయంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించాలని పేర్కొన్నారు. యూరియా పంపిణీ బాధ్యతను స్థానిక వ్యవసాయ అధికారులకు అప్పగించడంతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.

జూన్ 1వ తేదీన నిర్వహించిన సమీక్షలోనే వర్షాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని సీఎం గుర్తు చేశారు. అయితే జూన్ 9న కురిసిన భారీ వర్షాల సమయంలో కొంతమంది అధికారులు సమర్థంగా పనిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో మున్సిపల్, పోలీసు శాఖల మధ్య సమన్వయం లోపించిందని పేర్కొన్నారు.

వర్షాల సమయంలో నగరాల్లో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ ప్రాంతాలపై ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఫీల్డ్‌లో అందుబాటులో లేని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్రాఫిక్ నిర్వహణ విషయంలో కూడా సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల సమయంలో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైనే ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వచ్చి పరిస్థితులను పరిశీలిస్తానని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

“మానవ తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే సహించేది లేదు” అని సీఎం స్పష్టం చేశారు. ట్రాఫిక్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, డీజీపీ సి.వి. ఆనంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, ఈ. శ్రీధర్, డా. గౌరవ్ ఉప్పల్, కె. సురేంద్ర మోహన్, హరిచందనతో పాటు జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ బోర్డు, విద్యుత్ శాఖలు, పోలీసు శాఖలు, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles