వికారాబాద్: హస్నాబాద్ గ్రామానికి చెందిన కలాల్ శ్వేత గౌడ్‌ను భారతీయ జనతా యువ మోర్చా (BJYM) వికారాబాద్ జిల్లా ఇన్చార్జ్గా నియమిస్తూ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. శ్వేత గౌడ్ గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వివిధ బాధ్యతలను నిర్వహించారు. విద్యార్థుల సమస్యలతో పాటు సామాజిక అంశాలపై నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) పూర్తి చేశారు. ఈ సందర్భంగా శ్వేత గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను మరింతగా పార్టీతో అనుసంధానం చేస్తానన్నారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే యువత సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని శ్వేత గౌడ్ తెలిపారు.


