రోడ్డు విస్తరణ బాధితులకు భరోసా కల్పిస్తాం

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా

గుల్షన్ ఆధ్వర్యంలో చైర్మన్ కు వినతి పత్రం అందజేత

శ్రీ బలబీమా న్యూస్ ప్రతినిధి కొడంగల్:

కొడంగల్‌లో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.బీ. గుల్షన్ నేతృత్వంలో శనివారం చిరు వ్యాపారులు మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గుల్షన్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు దుకాణాలను తొలగించడంతో అనేక మంది చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ నందారం ప్రశాంత్ బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని, వారం రోజుల్లో కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు.

బస్టాండ్ ముందు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తించి వారికి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం చిరు వ్యాపారులు, ఎస్.బీ. గుల్షన్‌తో కలిసి చైర్మన్‌ను పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తార్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖద్రి తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/roi52FxBrEw
https://youtu.be/U4Q6MPlzpS4

మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన

మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles