రుక్కమ్మకు నివాళులర్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ / షాబాద్:

శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రుక్కమ్మ మరణం పట్ల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

రుక్కమ్మ మరణవార్త తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భీం భరత్‌తో కలిసి శనివారం షాబాద్‌లోని పట్నం కుటుంబ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రుక్కమ్మ మరణం పట్నం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మంత్రి వెంట సీనియర్ నేత షాబాద్ సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ రాహుల్ గుప్తా, మాజీ సర్పంచ్‌లు పామెన నర్సింలు, పర్వేద నర్సింహులు, మాణిక్యం గౌడ్, కుమ్మరి చెన్నయ్య, పార్టీ అధ్యక్షుడు పెంటారెడ్డి, సర్పంచ్ తమ్మలి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని రుక్కమ్మకు నివాళులర్పించారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles