మహిళా శక్తే తెలంగాణ ఆర్థిక ప్రగతికి మూలస్తంభం: సీఎం రేవంత్ రెడ్డి

  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
  •  2034 వరకు ప్రజల ఆశీర్వాదంతో పాలన కొనసాగిస్తాం
  • మహిళా శక్తి వారోత్సవాల్లో ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూన్ 9 :

మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం, రాష్ట్రవ్యాప్తంగా మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. ఆడబిడ్డలను లక్ష్మీదేవిగా, భూమిని భూమాతగా, దేశాన్ని భారతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావించే గొప్ప సంప్రదాయం మనదని చెప్పారు. తెలంగాణ గర్వకారణమైన చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహనీయ మహిళలు ప్రపంచానికి తెలంగాణ స్ఫూర్తిని చాటారని గుర్తు చేశారు.

మహిళలకు ఓటు హక్కు కల్పించి రాజకీయ అధికారం అందించిన ఘనత జవహర్‌లాల్ నెహ్రూకు దక్కుతుందని పేర్కొన్నారు. మహిళలను రాష్ట్రపతులు, మంత్రులు, కీలక పదవుల్లో నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. గత ప్రభుత్వం తొలి ఐదేళ్లలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటివరకు మహిళను తమ పార్టీ అధ్యక్షురాలిగా నియమించలేదని వ్యాఖ్యానించారు.

మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు 2013లో సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో 33 శాతం మహిళలు కీలక పాత్ర పోషించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం మహిళలకు అందించాల్సిన సున్నా వడ్డీ రుణాలను కూడా విడుదల చేయలేదని ఆరోపించిన సీఎం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బకాయిలన్నింటిని చెల్లించి, కొత్తగా సున్నా వడ్డీ రుణాలను మంజూరు చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలను పొందుతున్నారని వివరించారు. కొందరు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు మరింత సౌలభ్యం కలిగిందన్నారు.

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద కంపెనీలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు మరింత ఊతమివ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీలో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాల కోసం 106 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ ఆర్థిక ప్రగతి మహిళల చేతుల్లోనే ఉందని పేర్కొన్న సీఎం, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య కోటి మందికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

“ఈ వేదికగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు నేను మాట ఇస్తున్నాను. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది” అని సీఎం ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదంతో 2034 వరకు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ మహిళా సాధికారత కోసం మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వెయ్యి కాదు, మూడు వేల బస్సులకు యజమానులుగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అన్ని రకాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రూ.21 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాల పంపిణీ

ఈ కార్యక్రమంలో మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందజేశారు.

TGSRTC ఆధ్వర్యంలో కొనుగోలు చేసి నిర్వహిస్తున్న 553 బస్సులకు నిధులు సమకూర్చిన మండల మహిళా సమాఖ్యలకు అద్దె చార్జీల రూపంలో రూ.20.34 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున అద్దె చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

అలాగే మహిళల కోసం సున్నా వడ్డీ రుణాల కింద రూ.500 కోట్ల చెక్కును విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఆదా అయిన రూ.10,700 కోట్ల విలువైన ప్రయోజనాలను కూడా సీఎం ప్రతీకాత్మకంగా అందజేశారు.

మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి నిజమైన మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles