కొడంగల్‌లో ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

250 పడకల ఆసుపత్రితో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ప్రజాప్రతినిధులు

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూన్ 9:

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు మహ్మద్ యూసఫ్ తదితరులు పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన వారు, అధికారులతో మాట్లాడి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

ప్రారంభంలో తక్కువ సామర్థ్యంతో ప్రతిపాదించిన ఆసుపత్రిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 250 పడకల ఆసుపత్రిగా విస్తరించడం జరిగిందని వివరించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలు మెరుగైన వైద్య సేవలను తమ ప్రాంతంలోనే పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సాధారణ చికిత్సల కోసం హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని, కొత్త ఆసుపత్రి ప్రారంభమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు ప్రజలకు అందుతాయని తెలిపారు.

ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, ప్రత్యేక విభాగాలు, అత్యవసర చికిత్స సేవలు, మాతా-శిశు సంరక్షణ కేంద్రాలు, పరీక్షా ప్రయోగశాలలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్న ప్రజాప్రతినిధులు, గతంలో “వద్దురా నాయనా సర్కారు దవాఖానకు” అనే నానుడి ఉండేదని, ప్రస్తుతం “ఓదంపద సర్కారు దవాఖానకు” అని చెప్పుకునే స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఇందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలే కారణమని తెలిపారు.

కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యం, విద్య, రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి మరికొద్ది రోజుల్లోనే ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు.

కొడంగల్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే దిశగా నిర్మితమవుతున్న ఈ 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో ప్రారంభం కానుండటంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆసుపత్రి ప్రారంభమైతే కొడంగల్‌తో పాటు పరిసర మండలాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles