- కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 5 :
మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం దుద్యాల మండల పరిధిలోని కుదురుమళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాలప్ప, ఏపీఎం వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఔటి శేఖర్, అయ్యారయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, రవినాయక్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.


