- బిడ్డను అమ్మేసి మరో పెళ్లికి సిద్ధమైన యువతి..
- వీడియో రికార్డ్ చేసి ప్రాణాలు తీసుకున్న యువకుడు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మోసం చేసిందనే తీవ్ర మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న జంట కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుని కలిసి జీవించగా, అనంతరం వారి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు చివరకు యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పరిధిలోని కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ దాదాపు నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుని కలిసి జీవనం ప్రారంభించారు. అనంతరం వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. మొదట్లో సాఫీగా సాగిన వీరి సంసారం, కొంతకాలంగా విభేదాలతో నిండిపోయినట్లు సమాచారం.
ఇటీవల సరిత గోవర్ధన్‌ను దూరం పెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అంతేకాకుండా, తమకు పుట్టిన చిన్నారిని కూడా ఎవరికో అమ్మేసినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. బిడ్డ ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయమై గోవర్ధన్ పలుమార్లు సరితను కలిసి తనతో తిరిగి రావాలని వేడుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే సరిత తన నిర్ణయాన్ని మార్చుకోకుండా మరో పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైందని తెలిసింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ పెళ్లి పనులను కూడా గోవర్ధన్ చేతనే చేయించుకున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర అవమానం, మనోవేదనకు గురైన గోవర్ధన్ తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన గోవర్ధన్, మరుసటి రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అనంతరం గదిలోకి వెళ్లిన అతడు చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సాయంత్రం వరకు తలుపులు తీయకపోవడంతో గోవర్ధన్ సోదరి ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా, అతడు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు.
ఆత్మహత్యకు ముందు గోవర్ధన్ తన మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి పాత్ర, బిడ్డ అమ్మకం అంశం, అలాగే ఆ చిన్నారి ఎక్కడ ఉన్నాడన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



