- వికారాబాద్ జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్
శ్రీ బల భీమ న్యూస్ /యాదగిరిగుట్ట( జూలై 19):
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వికారాబాద్ జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్ హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ, రైతు సంఘం నాయకులు, కార్యకర్తల్లో వ్యవసాయ సమస్యలపై అవగాహన పెంపొందించడంతో పాటు సంఘటిత పోరాట స్ఫూర్తిని బలోపేతం చేయడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మూడు రోజులపాటు వివిధ అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, వర్షాభావంతో పంటలు సాగు చేయలేని రైతులకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



