- కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 15:
కొడంగల్ నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రూ.36.40 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తెలిపారు. సోమవారం కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించేందుకు 83 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి రూ.16.52 కోట్ల నిధులు కేటాయించామని ఆయన వెల్లడించారు. ఈ భవనాల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా, పోషకాహార సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
అదేవిధంగా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రూ.90 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులు, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
ఇక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యా మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 58 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.19.88 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నందారం ప్రశాంత్ తెలిపారు. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయని, దాదాపు పూర్తికావచ్చిన దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యా రంగ అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని విద్యా రంగంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



