శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించారు. దౌల్తాబాద్ మండలం గోఖఫసల్వాద్ గ్రామానికి చెందిన తన అత్యంత సన్నిహితుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరై సందడి చేశారు.

వధూవరులకు ఆశీర్వాదం
దౌల్తాబాద్ మండలంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జిల్లా దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహర, ఇతర అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం వివాహ వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొడంగల్ యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడిగా ఉంటూ, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం కోసం రెడ్డి శ్రీనివాస్ అహర్నిశలు శ్రమించారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన అనుచరుడి పట్ల ఉన్న అభిమానంతో, బిజీ షెడ్యూల్‌లోనూ సీఎం ఈ వేడుకకు రావడం విశేషం.ఈ వివాహ వేడుక కేవలం ఒక వ్యక్తిగత కార్యక్రమంలా కాకుండా, రాజకీయ ప్రముఖుల కలయికతో కోలాహలంగా మారింది. ముఖ్యమంత్రితో పాటురాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి రాజ్ ఠాకూర్ కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ వీరితో పాటు ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి నూతన దంపతులను దీవించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి శుభకార్యాలకు హాజరుకావడంపై దౌల్తాబాద్ మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “కార్యకర్తల కష్టాన్ని గుర్తించే నాయకుడు మా రేవంత్ రెడ్డి” అని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కొనియాడాయి. ముఖ్యమంత్రి రాకతో గోఖఫసల్వాద్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188


