- ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి:
- యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీను ముదిరాజ్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 19:
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదనే భయంతోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీను ముదిరాజ్ తీవ్రంగా విమర్శించారు.
శుక్రవారం కోడంగల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సబితా ఇంద్రారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా, ప్రజల్లో పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజం కూడా కోడంగల్‌లో రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోలేకపోయారని, అలాంటప్పుడు సబితా ఇంద్రారెడ్డి వచ్చి కోడంగల్ ప్రజలను ప్రభావితం చేయగలరని భావించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. కోడంగల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నారని, అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, అక్కడి పరిస్థితులను చక్కదిద్దకుండా కోడంగల్‌కు వచ్చి రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని రెడ్డి శ్రీను అన్నారు. ముందుగా మహేశ్వరంలో పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత కోడంగల్ గురించి మాట్లాడాలని సూచించారు.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోడంగల్ నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరవుతున్నాయని, విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో అనేక కీలక పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే కోడంగల్ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులకు తగిన రాజకీయ గుణపాఠం చెబుతారని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గం నుంచి లక్షకు పైగా మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగుళప్ప, బుగ్గప్ప, అశోక్, రాములు, కిష్టప్ప, రాంచందర్, మదర్ రాములు తదితరులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



