శ్రీ బల భీమ న్యూస్ – తాండూర్ :


వికారాబాద్ జిల్లా తాండూర్ RTC డిపో లో ఆర్టీసీ కార్మికులు BCసంక్షేమ సంఘాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. BCసంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ సమక్షంలో డిపో గౌరవ అధ్యక్షులుగా తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి, అధ్యక్షులుగా J. శ్రీనివాస్, కార్యదర్శిగా K. శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్ గా K. అశోక్, వైఫ్ ప్రసిడెంట్ లుగా శోభ, లక్ష్మిప్రియ, కోశాధికారిగా విజయ్ కుమార్, మాణిక్యప్ప, చైర్మన్ గా C. అంజిలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా K.చంద్రకాంత్ లనుఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో BCఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ పనిచేస్తుందనీ యొక్క కమిటీ నియమ నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు. అనంతరం ఈ కమిటీ సిఫార్సులను డిపో మేనేజర్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. బీసీ సంఘం నాయకులు ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు
జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు


