- కొడంగల్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
- సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్

నెల రోజులపాటు ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలో పూర్తి చేసుకుని శనివారం రంజాన్ పండుగ సందర్భంగా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ముస్లింలు ఈద్గ మైదానం లో రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్ ల తో పాటు కౌన్సిలర్లు ఈద్గ వద్ద ప్రార్థన అనంతరం సహచర ముస్లిం సోదరులకు పరస్పర శుభాకాంక్షలు అందించుకోవడమే ఈద్ ముబారక్ అన్నారు .

ముస్లిం సోదరులకు మరింత మానసిక బలాన్ని చేకూర్చి సాధన శక్తిని ప్రసాదించి జీవితమంతా అల్లాహు చూపిన మార్గంలో పయనించేలా చేయాలని ఆకాంక్షించడమే ఈద్ ముబారక్ చెప్పడంలో ఉద్దేశమని నందరం ప్రశాంత్ కొనియాడారు . వీరితోపాటు ముస్లిం సోదరులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ యూసఫ్ , కొడంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ , పట్టణ అధ్యక్షులు నయుమ్ లతోపాటు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు .





