- గ్రాడ్యుయేట్లంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి – కవిత పిలుపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం
- హైదరాబాద్, అక్టోబర్ 9 (శ్రీ బల భీమ న్యూస్):
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఓటరుగా నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె ఓటరు నమోదు దరఖాస్తును పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత, నిరుద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగాల కల్పనలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని కవిత విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు, యువత ఆకాంక్షలను ప్రతిబింబించేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.
తమ పార్టీ ప్రశ్నించే గొంతుకగా నిలుస్తుందని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు యువకులు, నిరుద్యోగులు ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కవిత విజ్ఞప్తి చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె కోరారు.


