యశోద ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క , కేటీఆర్

శ్రీ బల భీమ న్యూస్ /హైదరాబాద్, జూలై 27:

సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి సీతక్క , BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కేటీఆర్, ఇప్పటివరకు అందించిన వైద్య చికిత్స వివరాలను పరిశీలించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతూ, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన కేటీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ,బీఆర్ఎస్ నాయకులు కూడా సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తమ మద్దతు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles