జనసేన పార్టీ బలోపేతానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కుటుంబం లాంటిదని.. హై కమాండ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.
విశాఖపట్నం, మార్చి15 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ బలోపేతానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు (Nagababu) వ్యాఖ్యానించారు. ఈరోజు(ఆదివారం) విశాఖపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నాగబాబు పాల్గొని మాట్లాడారు. పార్టీ కుటుంబం లాంటిదని.. హై కమాండ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. జనసేన సభ్యత్వం నమోదుకు అన్నివర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని వివరించారు. గతంలో కంటే సభ్యత్వం రెట్టింపు అయిందని నాగబాబు పేర్కొన్నారు.


