కొడంగల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

  • హ్యాండ్ పంపులు, మోటార్ బోర్ల మరమ్మతులకు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ఆదేశాలు

శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, జూన్ 28:

ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాల మేరకు కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మరమ్మతులకు గురైన హ్యాండ్ పంపులు, మోటార్లు, బోర్లను తక్షణమే మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ మున్సిపాలిటీ 10వ వార్డులో ఉన్న బోర్లకు ప్లెస్సింగ్ పనులు చేపట్టి, వాటిని తిరిగి వినియోగానికి సిద్ధం చేశారు. వేసవి కాలం ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో తాగునీటి అవసరం కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ సూచించారు.

మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా హ్యాండ్ పంపులు, మోటార్లు, బోర్లు పనిచేయని పరిస్థితి ఉంటే వెంటనే వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక చొరవతో తమ ప్రాంతంలో నిలిచిపోయిన బోర్లకు మరమ్మతులు చేపట్టడం వల్ల తాగునీటి సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ పాలకవర్గం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ కే. రాజశేఖర్, కొడంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ ఖాన్, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles