దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లను రాజీనామా చేయించు పట్నం నరేందర్ రెడ్డి కి సవాల్ చేసిన కొడంగల్ కాంగ్రెస్ నాయకులు …

  • కొడంగల్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతల మండిపాటు
  • పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్‌ను వదిలి మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి –
  • రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరిక

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూన్ 7:

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని కొడంగల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం అంబయ్య గౌడ్, టీపీసీసీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

వారు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైందని, అందుకే వాస్తవాలను పక్కనపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ ప్రాంతం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

పట్నం నరేందర్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని, ప్రజలకు చేసిన సేవల గురించి మాట్లాడాలని సూచించారు. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా నీ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని, అప్పుడు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో స్పష్టమవుతుందని సవాల్ విసిరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని, రాబోయే ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి కనీసం డిపాజిట్ ఓట్లు కూడా దక్కని పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

కొడంగల్‌లో అభివృద్ధి పనుల పరంపర

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని నేతలు వివరించారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో పాటు ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యా రంగానికి కొత్త ఊపు లభించిందన్నారు.

అదేవిధంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, గ్రామీణ మౌలిక వసతుల మెరుగుదల వంటి అనేక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ అదే రోడ్లపై తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యేకు ఈ అభివృద్ధి కనిపించకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు.

ఇసుక రవాణాపై ఆరోపణలు నిరాధారం

బొమ్మస్‌పేట మండలంలో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఇసుక అవసరం సహజమని తెలిపారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ల అనుమతులతోనే ఇసుక రవాణా జరుగుతోందని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద కుటుంబాలకు కూడా ఇసుక అత్యవసరమని, అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తిరుపతి రెడ్డిపై కమిషన్ల ఆరోపణలు చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదేనని పేర్కొన్నారు.నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కొడంగల్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, కౌన్సిలర్లు సయ్యద్ హమీద్, దాము, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మునీర్,రమేష్ బాబు,  మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ అలీ, చిన్ననందిగామ సర్పంచ్ దత్తాత్రేయరావు, కస్తూరిపల్లి సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమశేఖర్, పర్సాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అశ్వక్, రాము, సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles