- అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తీవ్ర ఆగ్రహం
- “ప్రజాప్రతినిధులకు విలువ లేదా?.. కోట్ల నిధులు వస్తున్నా అభివృద్ధి ఎందుకు నిలిచిపోయింది?”
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : మే 27:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను రాష్ట్రానికే కాక దేశానికి ఆదర్శవంతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుండగా, స్థానికంగా అభివృద్ధి పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు, కాలనీల అభివృద్ధి పనులు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో బుధవారం కొడంగల్ కడ ప్రత్యేక కార్యాలయంలో కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ హాజరై అభివృద్ధి పనుల పురోగతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశానికి కీలక అధికారులు గైర్హాజరు
సమావేశానికి మున్సిపల్ కమిషనర్‌తో పాటు SVK సంస్థ కాంట్రాక్టర్లు, మున్సిపల్ DE, AEOలు తదితర కీలక అధికారులు హాజరుకావాల్సి ఉండగా, కేవలం కమిషనర్ మాత్రమే హాజరు కావడం ప్రజాప్రతినిధులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. “ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సమావేశానికే అధికారులు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది?” అంటూ చైర్మన్ ప్రశాంత్ మండిపడ్డారు.
కొడంగల్ అభివృద్ధి పనులను కేవలం 18 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, ఏడాది గడిచినా పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి కాలనీ అభివృద్ధి కోసం తవ్వకాలు చేపట్టి పనులు అర్ధాంతరంగా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“CC రోడ్లు పోయి.. బురద రోడ్లు వచ్చాయి”
కొడంగల్ పట్టణంలోని పలు కాలనీలలో సీసీ రోడ్లు తొలగించి, కొత్త పనులు ప్రారంభించినప్పటికీ అవి కాస్త పూర్తి చేయకపోవడంతో రోడ్లు అన్ని ప్రస్తుతం బురదమయమైన రహదారులుగా మారిపోయాయని చైర్మన్ ఆరోపించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు చెరువులను తలపించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రజల ఫిర్యాదుల మేరకు కాలనీలను సందర్శించిన సమయంలో ప్రజలు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులను నిలదీశారని, ప్రజల ఆగ్రహానికి తామే గురవుతున్నామని పేర్కొన్నారు. “పనులు పూర్తి చేయాల్సింది అధికారులు, కాంట్రాక్టర్లు… కానీ ప్రజల ఆగ్రహం మాత్రం ప్రజాప్రతినిధులపైనే పడుతోంది” అని వాపోయారు.

ప్రైవేట్ లేఔట్లలో పనులు పూర్తి… కాలనీల్లో ఎందుకు కాదు?
ఎస్వీకే సంస్థ కాంట్రాక్టర్లు ముందుగా పట్టణంలోని కొన్ని ప్రైవేట్ లేఔట్లలో మంచినీటి పైపులైన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మ్యాన్‌హోల్ పనులు వేగంగా చేయడం జరిగింది , కానీ కార్గిల్ కాలనీ ఇంద్ర నగర్ శాంతినగర్ సన్ సిటీ తదితర కాలనీలలో మాత్రం పనులు నిలిచిపోవడం వెనుక కారణమేంటో అర్థం కావడం లేదని చైర్మన్ ప్రశ్నించారు. “మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లు పదేపదే SVK కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి సమస్యలు వివరించినా స్పందన లేదు. పనులు చేయాల్సిన వారు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ఆశయాలకు విరుద్ధంగా అధికారుల తీరు
ప్రతి రోజూ మీడియాలో అభివృద్ధి పనులపై ప్రతికూల కథనాలు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమావేశంలో ప్రస్తావించారు. “కోట్లాది నిధులు ఇస్తున్నా పనులు ఎందుకు పూర్తి కావడం లేదు?” అని సీఎం ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
కొడంగల్‌ను అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు విరుద్ధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులను గౌరవించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
“సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం”
అభివృద్ధి పనుల్లో జాప్యానికి ప్రధాన కారణం అధికారుల మధ్య, అధికారులు – ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపమేనని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరుగుతోందని తెలిపారు.
ఇకపై కొడంగల్‌లో విధులు నిర్వహించే ప్రతి అధికారి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని చైర్మన్ సూచించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి సూచనలు
ఈ సందర్భంగా కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అధికారులూ – ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమేనని తెలిపారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి అధికారులు కట్టుబడి ఉండాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్య, వైద్యం, రోడ్లు, మంచినీటి సదుపాయాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
ప్రతి గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, రోడ్లు పూర్తయిన వెంటనే ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి
ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వెంకటరెడ్డి సూచించారు. ఇప్పటికే మంజూరైన ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని, త్వరలో రెండో విడత మంజూరులు కూడా వస్తాయని తెలిపారు. ఇందుకు సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం అంబయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీడీవో ఉషాశ్రీ, తహసీల్దార్ రాంబాబు, ఎంఈఓ రాంరెడ్డి, తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



