- ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ విద్యాశాఖ హెచ్చరిక
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్
కొడంగల్ : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ విద్యాశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలకు విక్రయిస్తే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థుల గోప్యతను కాపాడాలని, డేటా భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
అడ్మిషన్ల పేరుతో సేకరిస్తున్న విద్యార్థుల వివరాలు కొందరు అక్రమార్కులు ప్రైవేట్ ఏజెన్సీలకు చేరవేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల పేర్లు, మొబైల్ నంబర్లు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు, థర్డ్ పార్టీ సంస్థలకు లేదా అనధికారిక ఏజెన్సీలకు అందించరాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి డేటా విక్రయం లేదా దుర్వినియోగానికి పాల్పడితే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (RJDలు), జిల్లా విద్యాశాఖాధికారులు (DEOలు), ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. విద్యార్థుల డేటాను కేవలం అధికారిక విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఫేక్ లోన్ ఆఫర్లు, ప్రమోషనల్ కాల్స్, అపరిచిత సందేశాలు అధికంగా వస్తుండటంతో స్కూళ్లు, కాలేజీల నుంచే డేటా లీక్ అవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ప్రైవసీ రక్షణకు కీలకంగా మారిందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



