విద్యార్థి సంఘం నేత ముసుగులో అక్రమ దందా

  • ఆకాష్ నాయక్ ఉదంతంపై అయోధ్య శ్రీనివాస్ ఆగ్రహం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

షాద్‌నగర్: విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూనే, పేదల నోటి కాడి కూడును అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన ఏఐఎస్ఎఫ్ నేత ఆకాష్ నాయక్ ఉదంతాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పి ఎస్) యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం జిల్లేడు చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో ఆకాష్ నాయక్ వాహనం పట్టుబడటంపై ఆయన స్పందిస్తూ.. విద్యార్థి సంఘం నాయకుడి పేరుతో చలామణి అవుతూ ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

విద్యార్థి సంఘం నాయకుడి పేరుతో చలామణి అవుతూ, పేదల నోటికాడి కూడును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన ఆకాష్ నాయక్ ఉదంతంపై లంబాడి హక్కుల పోరాట సమితి యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూనే, వెనుక ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. విద్యార్థి సంఘం ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రజలకు నీతి వాక్యాలు చెప్పే ఇలాంటి వ్యక్తుల తీరు హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.

ఈ అక్రమ రవాణా వ్యవహారంలో ఆకాష్ నాయక్ తో పాటు అతని సోదరుడు సంతోష్‌పై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అయోధ్య శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుండి ఈ అక్రమ రవాణా సాగుతోంది అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles