- ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..
- ఆకాష్ నాయక్ పేర ఉన్న బులెరో వాహనంలో 25 క్వింటాళ్ల “రేషన్ బియ్యం” పట్టివేత
- ఆకాష్ సోదరుడు సంతోష్ చేత నిర్వాకం
- ఇతర రాష్ట్రాలకు రేషన్ తరలిస్తున్న వైనం
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్
విద్యార్థులకు సన్న బియ్యం సక్రమంగా అందడం లేదని.. నూకలు వస్తున్నాయని అరిచి గోల చేసే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేత ఆకాష్ నాయక్ పై అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేసు నమోదయింది. తన పేరున ఉన్న బొలెరో వాహనాన్ని అతని సోదరుడు వాడుతున్నట్లు గుర్తించిన ఎస్వోటీ పోలీసులు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేసిన సంఘటన జిల్లేడు చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

షాద్ నగర్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేత ఆకాష్ నాయక్ పేరిట ఉన్న బొలెరో వాహనం నంబర్ టీజీ 07వి 4847 లో డ్రైవర్ పాత్లావత్ సంతోష్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు గ్రామస్తుల వద్ద కొనుగోలు చేసి వాటిని మహారాష్ట్రలు విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. 40 కేజీల రేషన్ బియ్యం 56 సంచులు మొత్తం ఇసోటి పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. అదేవిధంగా వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులైన ఉన్నాయని పోలీసులు ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో పోలీసులు ఈ అక్రమ బియ్యాన్ని వెంటనే సిస్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్ సంతోష్ ఆకాష్ నాయక్ కు సోదరుడు. అయితే విద్యార్థి సంఘం నాయకుడు ఆకాష్ నాయక్ ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణా తరలింపు కేసులో చిక్కుకోవడంతో సంచలనం రేకర్తిస్తుంది. విద్యార్థుల హక్కుల కోసం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం పోరాడే ఆకాష్ నాయక్ ఇలా రేషన్ బియ్యం అక్రమంగా తరలించే కేసులో బుక్ కావడంతో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ఈ వ్యవహారం పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటినుండి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేక కారణాలతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు..
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



