శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్
- నాగారం గ్రామ సర్పంచ్ పట్లోళ్ల ప్రశాంత కుమారి, మదనసింహ రెడ్డి సూచనలు
నాగారం, ఏప్రిల్ 14:
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని నాగారం గ్రామ సర్పంచ్ పట్లోళ్ల ప్రశాంత కుమారి, మదనసింహ రెడ్డి సూచించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన “అరైవ్ & అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు, యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రాణాంతకమని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు, మహిళలు కలిసి రోడ్డు భద్రతపై ప్రమాణం చేశారు. “ట్రాఫిక్ నియమాలను పాటిస్తాము, ఇతరులను కూడా పాటించేందుకు ప్రోత్సహిస్తాము” అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం ద్వారా యువతలో మంచి చైతన్యం కలిగిందని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఊరడి మధుసూదన్, వార్డు సభ్యులు శివప్ప, వెంకటమ్మ, శామామ్మ, రాజుగౌడ్, కమలమ్మ, పంచాయతీ సెక్రటరీ పరేష్, అలాగే మాజీ సర్పంచ్‌లు బస్వంత్ రెడ్డి, అంజిల్ రెడ్డి, అనంతప్ప, మరియు నాయకులు ప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మదనసింహ రెడ్డి, డి. పాకిరప్ప, కే. శంకరప్ప, దేవేందర్ గౌడ్, పాండు, నర్సిములు గౌడ్, సాయిలు, కేశవులు, అనిల్, కృష్ణ గౌడ్, శ్రీశైలం, మల్కాప్ప, ఆశప్ప, నర్సిములు, ఊరడి హన్మంత్, చాకలి చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమం గ్రామంలో సురక్షిత రవాణా పట్ల చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



