- ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది
- కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం కొడంగల్ పట్టణంలోని వెటర్నరీ హాస్పిటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ అనిత బత్తుల నరసింహతో కలిసి మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాల పథకాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ నిధుల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను దేశానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా పొందే లాభాలు, కొడంగల్‌లో ఏర్పాటు కానున్న ఆల్ఫామ్ ఫ్యాక్టరీ ద్వారా స్థానికులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, “ఇంటికి ఇల్లాలే వెలుగు” అన్న నానుడికి తగ్గట్టుగా మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



